దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండటం కామన్. కానీ, ఓ ఆర్టీసీ బస్సులో ఒక డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే మరొకరు గేర్లు వేయడం ఎప్పుడైనా చూశారా? అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది. గేరు రాడ్డు విరిగిపోవడంతో బస్సులో ఉన్న మరో డ్రైవర్ చిన్న ఇనుప రాడ్డుతో గేర్లు మార్చడం వీడియోలో కనిపించింది. అలా ఇద్దరూ కమ్యూనికేట్ చేసుకుంటూ బస్సును ముందుకు నడిపించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.
ఇలా బస్సు నడపటం ఎక్కడైనా చూశారా?
27
Jul