ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళకు బోనాలు ఎత్తుకొని, డప్పు చప్పుళ్ల నడుమ పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి, పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా పడి, పిల్లపాపాలతో చల్లగా ఉండాలని బలిదానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు
రెబ్బెనలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
28
Jul