TG: ములుగు జిల్లాలో కానిస్టేబుళ్లు సీపీఆర్ చేసి కాపాడిన వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు వదిలాడు. గోవిందరావుపేట మండలం పస్రాలో ఆదివారం లక్ష్మణ్ అనే వ్యక్తి గోడపై నుంచి పడి స్పృహ కోల్పోయాడు. మంత్రి సీతక్క పర్యటనలో భాగంగా అక్కడ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు లక్ష్మణ్కు సీపీఆర్ చేసి, శ్వాస అందించి ప్రాణాలు కాపాడారు. అయితే కిందపడినప్పుడు తలకు బలమైన గాయం తగలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
సీపీఆర్తో ఊపిరినిచ్చారు.. అయినా దక్కని ప్రాణం
07
Aug