APలో కాగిత రహిత క్యాబినెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత సమావేశాలకు 40 సెట్ల నోట్స్ ముద్రిస్తుండగా, ఇకపై అన్నీ సాఫ్ట్ కాపీల రూపంలో మంత్రులు, అధికారులకు ప్రభుత్వం అందించనుంది. ఇందుకోసం మంత్రులు, అధికారులకు ప్రభుత్వం ఐప్యాడ్లు అందించనుంది. దీని ద్వారా ప్రింటింగ్ ఖర్చులు ఆదా కావడంతో పాటు లీకేజీల నియంత్రణ సాధ్యమవుతుందని ప్రభుత్వం అంచనా వస్తోంది.
మంత్రులకు త్వరలోనే ఐప్యాడ్లు.. ఈ-క్యాబినెట్ భేటీలు
14
Aug