కర్ణాటకలోని ఉడిపిలో రోడ్లు అధ్వానంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రోడ్డుపై గుంతలు ప్రయాణికులకు మృత్యు ఉచ్చులుగా మారాయని తెలిపేలా కొందరు వినూత్నంగా నిరసన తెలియజేశారు. యముడు, చిత్రగుప్తుడు, చనిపోయిన వారి ఆత్మలుగా రెడీ అయి రోడ్డెక్కారు. ఆత్మలకు యముడు లాంగ్ జంప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రదర్శన చేశారు. ఈ వీడియో వైరలవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి.
రోడ్డుపై గుంతలు.. యముడొచ్చాడు!
29
Aug