TG: పలు సమస్యలతో నిలిచిన రుణమాఫీపై ఫీల్డ్ సర్వే మొదలైంది. సాంకేతిక సమస్యలు ఉన్న రైతుల ఇండ్లకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి కుటుంబ సభ్యుల నిర్ధారణను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 4.24 లక్షల అకౌంట్లు పెండింగ్లో ఉండగా నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. శనివారం సాయంత్రం కల్లా ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం వారి అకౌంట్లకు సంబంధించి రుణమాఫీ చేయనున్నట్లు సమాచారం.
రుణమాఫీపై సర్వే ప్రారంభం
29
Aug