TG: ఉరేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్న వ్యక్తికి తెలంగాణ పోలీసులు సీపీఆర్ చేసిన ఘటన ఇది. సికింద్రాబాద్‌కు చెందిన వినోద్ అనే వ్యక్తి ఈరోజు ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికెళ్లారు. వినోద్‌కు సీపీఆర్ చేసి గుండెలో చైతన్యం తెప్పించిన అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల సత్వర స్పందనపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
శభాష్ పోలీస్: ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తికి సీపీఆర్
06
Sep