కుబీర్ మండల కేంద్రంలో పలు వీధుల్లో తిరిగే కుక్కలకు వింతరోగం సోకింది. వ్యాధి సోకిన కుక్కల వెంట్రుకలు మొత్తం ఊడిపోయి భయంకరంగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒకటిరెండు కుక్కలకు మాత్రమే ఈ వ్యాధి సోకగా క్రమంగావాటి సంఖ్య పెరుగుతోంది. దీంతో భయాందోళనకు గురవుతున్నట్లు స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి కుక్కలకు చికిత్స అందించాలని కోరారు.
కుబీర్: వీధి కుక్కలకు వింత రోగం
13
Sep