జానీ మాస్టర్ ని గోవాలో అరెస్ట్

మాస్టర్ ని పోలీసులు నిన్న గోవా లో అరెస్ట్ చేసి, నేడు హైదరాబాద్ లోని ఉప్పరపల్లి కోర్టు లో హాజరు పర్చిన సంగతి తెలిసిందే.కోర్టు జానీ మాస్టర్ కి 14 రోజుల పాటు రిమాండ్ విధించగా, పోలీసులు ఆయన్ని చెంచల్ గూడా జైలుకు తరలించారు. రిమాండ్ సెల్ లో ఉన్నటువంటి జానీ మాస్టర్ ని పోలీసులు విచారించగా, సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈమేరకు పోలీసులు విచారణలో వెలువడ్డ విషయాలను కాసేపటి క్రితమే మీడియా కి పంచుకున్నారు. జానీ మాస్టర్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టుగా పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. మనసులో చెడు ఆలోచనలు పెట్టుకొనే జానీ మాస్టర్ శ్రేష్టి వర్మ ని తన టీంలోకి అసిస్టెంట్ గా తీసుకున్నాడని, 2019 సంవత్సరంలో వీళ్లిద్దరికీ తొలిసారి పరిచయమైందని పోలీసులు పేర్కొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

2020 వ సంవత్సరం లో జానీ మాస్టర్ ఆ అమ్మాయిపై లైంగిక వేధింపులు మొదలు పెట్టాడని, ఆయన అలా ప్రవర్తించినప్పుడు, ఆ అమ్మాయి వయస్సు కేవలం 16 ఏళ్ళు మాత్రమే అని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ నాలుగేళ్లలో బాధితురాలిపై జానీ మాస్టర్ అనేక సార్లు లైంగిక దాడులు చేసినట్టుగా రిమాండ్ రిపోర్టు లో పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయట పెడితే, కెరీర్ లో అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని పోలీసులు చెప్పుకొచ్చారు. నేరం ఒప్పుకున్నాడు కాబట్టి, పోలీసులకు పెద్ద శ్రమ దొరకలేదు. ‘పోస్కో’ చట్టం క్రింద జానీ మాస్టర్ కి పదేళ్లకు పైగా కఠిన కారాగార శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు ఈ కేసులో జానీ మాస్టర్ కి బెయిల్ కూడా దొరకదు. నేషనల్ అవార్డుని గెలుచుకొని, కెరీర్ లో పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో, తన చేతులారా జానీ మాస్టర్ తన కెరీర్ ని సర్వనాశనం చేసుకున్నాడు. భార్య ఉండగా ఒక మైనర్ బాలికపై జానీ మాస్టర్ ఇలాంటి లైంగిక దాడి చేయడం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *