నిత్యం రద్దీగా ఉండే కర్నూలు బస్టాండ్లో కనీస సౌకర్యాలు కరవై ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అపరిశుభ్రత కారణంగా దుర్గంధం వెదజల్లుతోంది. మరుగుదొడ్లు ఉన్నా నిర్వహించేవారు లేక చాలా వాటికి తాళాలు వేశారు. దీంతో ఎక్కడపడితే అక్కడే మూత్ర విసర్జన చేస్తున్నారు. మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్లో ప్లాట్ ఫామ్ల మరమ్మతులు రోజుల తరబడి చేస్తుండటంతో బస్సులు ఎక్కేందుకు అవస్థలు తప్పడం లేదు.
అధ్వానంగా మారిన కర్నూలు ఆర్టీసీ బస్టాండ్
21
Sep