TG: అత్యాచార ఆరోపణలతో అరెస్టై చంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఆయన భార్య ఆయేషాను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు యత్నించారన్న ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ యువతిని ఆయేషా బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
జానీ మాస్టర్ భార్య అరెస్ట్కు రంగం సిద్ధం
21
Sep