AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని TTD ఈఓ శ్యామలరావును dy. CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాల్లో రాజీ పడొద్దని తేల్చిచెప్పారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈఓతో పవన్ భేటీ అయ్యారు. కాగా గత ప్రభుత్వ హయాంలోనే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈఓ తెలిపారు. TTD తరఫున రేపు మహాశాంతి యాగం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి: TTD ఈఓతో పవన్
23
Sep