హరియాణాకు చెందిన రోశ్నీ దేవీ సాంగ్వాన్ వయసు 70 ఏళ్లు. అయితేనేం.. 70 కిలోల బరువుల్ని కూడా అవలీలగా మోసేస్తున్నారు. కీళ్లవాతం, గాయం కారణంగా రెండేళ్ల క్రితం ఆమెకు నడవడమే కష్టంగా ఉండేది. అలాంటి ఆమె తన కుమారుడి సూచనతో వెయిట్ లిఫ్టింగ్ అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు నడవడం కాదు చెంగుచెంగున పరిగెడుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్లో భారత్కు గోల్డ్ మెడల్ తేవాలనేది తన కల అని చెబుతున్నారామె. ఆల్ ది బెస్ట్!
వృద్ధురాలు కాదు వెయిట్ లిఫ్టర్
28
Sep