‘దేవర’ డాల్బీ అట్మాస్.. విదేశాల్లో తొలి ఇండియన్ సినిమాగా రికార్డు

విడుదలకు ముందే పలు రికార్డులు సొంతం చేసుకున్న ‘దేవర’.. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఇంటర్నెటెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘దేవర’ ట్రెండ్ నడుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు షేర్ అవుతున్నాయి. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ యాక్షన్ డ్రామా తాజాగా మరో ఘనత సాధించింది. ఓవర్సీస్లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన ఈ సినిమా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ (Devara) నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్ప్లే, న్యూజిలాండ్లో 3 స్క్రీన్ప్లే ఈ సినిమా విడుదల కానుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *