భర్త సరిగా చూడడం లేదని పిల్లలకు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి ఇచ్చిన మహిళ
– తాను కూడా తాగి ఆత్మాహత్యాయత్నం
– ఇద్దరు చిన్నారులు మృతి.. ప్రాణాలతో బయటపడిన తల్లి కుముందానివానిపేటలో విషాదం
సంతబొమ్మాళి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): నవ మాసాలు మోసి, కని పెద్ద చేసిన ఆ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసింది. భర్త సరిగా చూడడం లేదని కుమారులకు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి ఇచ్చి తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ కూల్‌డ్రింక్ తాగిన పిల్లలు మృతి చెందగా, ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన సంతబొమ్మాళి మండలం మలగాం పంచాయతీ కుముందానివానిపేటలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుముందానివానిపేటకు చెందిన గొర్జంగి దుర్గకు అదే గ్రామానికి డెక్కల రాజుతో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి రుషి(10), బాలాజీ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నారు. తండ్రి రాజు శ్రీకాకుళంలోని ఒక హోటల్లో కుక్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం గ్రామంలో దసరా పత్తిరి వారాలు కావడంతో తమ ఇంటికి విందుకు రావాలని దుర్గ తమ్ముడు గొర్జంగి హరి సోమవారం రాత్రి పిలుపు చేశాడు. అయితే, వంట చేయడం అయిపోయిందని, ఈ రాత్రికి భోజనాలు చేసి రేపు ఉదయం వస్తానని తమ్ముడితో దుర్గ చెప్పింది. దీంతో