AP: నవంబర్ నెల నుంచి రేషన్లో నాలుగు రకాల సరుకులు అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును సబ్సిడీపై అందిస్తున్నారు. అక్టోబర్లో 50 శాతం కార్డుదారులకు కందిపప్పు అందించగా NOV నుంచి 100% అందేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మార్కెట్లో దీని ధర రూ. 170 వరకు ఉండగా రేషన్లో రూ.67కే ఇస్తున్నారు. ఇటు బియ్యం వద్దనుకునే వారికి 3KGల జొన్నలు సైతం అందించనున్నట్లు తెలుస్తోంది.
రేషన్ కార్డుదారులకు శుభవార్త
30
Oct