AP: దీపావళి పండుగ రోజున ఏలూరులో తీవ్ర విషాద ఘటన జరిగింది. పట్టణంలోని తూర్పువీధిలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై గోనెసంచిలో బాణసంచా తీసుకెళ్తుండగా బండి గోతిలో పడింది. దీంతో ఒక్కసారిగా గోనెసంచిలోని ఉల్లిపాయ బాంబులు రాపిడికి గురై పేలాయి. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పేలుడు ధాటికి శరీరం ముక్కలైంది. సమీపంలో ఉన్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దీపావళి రోజున ఘోర ప్రమాదం
01
Nov