TG: హైదరాబాద్లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు పారింది. కొండాపూర్లో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులోకి నీరు చేరింది. మోకాలి లోతు నీళ్లలోనూ బస్సును తీసుకెళ్లడంతో వరద లోపలికి చేరింది. ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. నగరం ఎంత అభివృద్ధి చెందినా డ్రైనేజీ సిస్టమ్ మారదంటూ పలువురు విమర్శిస్తున్నారు.
రన్నింగ్ బస్సులోకి వరద నీరు
03
Nov