AP: తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన రవీందర్ రెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ట్వీట్ చేశారు. ‘నేను వైఎస్ఆర్కు పుట్టలేదని అవమానించారు. ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు. అసభ్యకర పోస్టులతో ప్రతిష్ఠ దెబ్బతీసేలా పోస్టులు పెట్టేవారిపై కఠినంగా చర్యలు ఉండాలి’ అని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
నేను YSRకు పుట్టలేదని అవమానించారు: షర్మిల
08
Nov