క్రికెటర్ కృనాల్ పాండ్య కుటుంబ సమేతంగా ఉజ్జయిని శ్రీ మహాకాలేశ్వరుడిని సందర్శించారు. చివరి కార్తీక సోమవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత తన కోరికలను నందికి విన్నవించారు. తానిక్కడికి తొలిసారి వచ్చానని, చాలా బాగుందని తెలిపారు. IPL వేలానికి ముందు ఆయన ఆలయానికి రావడం ఆసక్తిగా మారింది. వేలంలో ఎక్కువ డబ్బులు రావాలని దేవుడికి మొక్కుకున్నాడేమోనని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.
IPL వేలానికి ముందు గుడికెళ్లిన టీమ్ ఇండియా క్రికెటర్
26
Nov