త్వరలో రెండో దశ మెట్రో పనులు: NVS రెడ్డి
TG: త్వరలోనే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు ప్రారంభిస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై సీఎం రేవంత్ సూచనలతో ముందుకు వెళ్తామన్నారు. పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెట్రో అభివృద్ధి చేయాలని సీఎం సూచించారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానంలో HYD ఉందని.. వెంటనే మెట్రో విస్తరించకపోతే 9వ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు