కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

AP: కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పంటకాలువలోకి కారు దూసుకెళ్లి తల్లి, ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. నేలపూడి విజయ్ తన ఫ్యామిలీతో కలిసి కారులో వైజాగ్ నుంచి పి.గన్నవరం మండలం పోతవరం వెళ్తున్నారు. ఈ క్రమంలో చింతావారిపేట వద్ద కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్ భార్య, ఇద్దరు పిల్లలు మృతిచెందారు. విజయ్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో మహిళ డ్రైవింగ్ చేసినట్లు తెలుస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *