TG: రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు.
SBI ఏటీఎంలో చొరబడి నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షలు కాజేశారు. ప్లాన్ ప్రకారం ఏటీఎంలోకి వెళ్లి ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్, రాడ్లతో ATMను బద్దలు కొట్టి డబ్బులు తీసుకొని పరారయ్యారు. కేవలం 4 నిమిషాల్లోనే ఈ తతంగం కానిచ్చారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.