రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయిన మహిళ.. రైల్వే సిబ్బంది అప్రమత్తతతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ముంబయి బోరివలి రైల్వేస్టేషన్లో ట్రైన్ దిగుతుండగా ఆమె జారిపడింది. అది గమనించిన సిబ్బంది హుటాహుటిన అక్కడికి పరిగెత్తి మహిళను ట్రాక్‌పై పడకుండా పట్టుకొని లాగారు. రైల్వే మంత్రిత్వశాఖ ఈ వీడియోని పోస్ట్ చేసింది. మెరుపువేగంతో స్పందించి ప్రాణాలు కాపాడారని పోలీసుని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మహిళ ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీస్
12
Mar