ఇంట్లో పనిచేసే వారిని కూడా కొందరు సొంతవాళ్లలా చూసుకోవడం చూస్తుంటాం. అలాంటి ఓ కుటుంబం పనిమనిషి వెళ్లిపోతుంటే సెండాఫ్ ఇచ్చిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ అమ్మాయికి పెళ్లి సెట్ కావడంతో పని మానేసేందుకు సిద్ధమైంది. ఇంటి ఆడపడుచు వెళ్తున్నట్లు భావించిన యజమానులు ఆమెకు బొట్టు, బట్టలు పెట్టి డబ్బులిచ్చి ఆప్యాయంగా సాగనంపారు. ఇంట్లో పిల్లలు కూడా ఆమె వెళ్తుందని తెలిసి ఏడ్చేసిన వీడియో వైరలవుతోంది.
పనిమనిషి కాదు.. ఆడపడుచులా సాగనంపారు
29
May