తమిళనాడులోని ధర్మపురిలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. మెడలో పాముతో మద్యం దుకాణం వద్దకు వెళ్లి అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేశాడు. మద్యం బాటిల్ కొనుగోలు చేసి పాముకు తాగించి దానికి ముద్దు పెట్టాడు. రోడ్డు మధ్యలోకి వెళ్లి వాహనాలను ఆపుతూ రచ్చ చేశాడు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఊగిపోతున్న ఆ యువకుడిని అక్కడి నుంచి పంపించేశారు.
మద్యం మత్తులో పాముతో యువకుడు
13
Jun