దాయాది దేశం పాకిస్థాన్‌లో వర్షాలు భారీగా ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటివరకు ఆయా ఘటనల్లో 200 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 100 మంది చిన్నారులే ఉన్నారని పేర్కొన్నారు. అత్యధికంగా పంజాబ్ ప్రావిన్స్‌లో 123 మంది చనిపోయారని వెల్లడించారు. ఇళ్లు కూలిన ఘటనల్లో మరణాలు అత్యధికంగా చోటు చేసుకున్నాయన్నారు. సుమారు 560 మంది గాయపడినట్లు తెలిపారు.
పాక్ లో భారీ వర్షాలు.. 200 మందికి పైగా మృతి
21
Jul