AP: ఎన్నికల ఫలితాల రోజు తాను టీవీ చూడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘కూటమి అఖండ మెజారిటీతో గెలుస్తుందని నాకు తెలుసు. నేను ఒక్కడినే కూర్చొని పుస్తకాలు చదువుకున్నా. టెన్షన్ పడదలుచుకోలేదు. వెనుకడుగు వేయకుండా నిలబడ్డాను. నా కర్మ నేను సక్రమంగా నిర్వర్తించాను. దేవుడు ఏది ఇస్తే అదే అనుకున్నాను. కానీ అఖండ విజయం ఇచ్చాడు’ అని పిఠాపురం కార్యకర్తలతో పవన్ అన్నారు.
రిజల్ట్స్ రోజు టీవీ చూడలేదు.. ఎందుకంటే?: పవన్ కళ్యాణ్
01
Jul