ఆదిలాబాద్ తిర్పల్లిలోని ఓ గోడౌన్లో నిల్వ ఉంచిన దాదాపు వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ అశోక్ గోదామును పరిశీలించి నిల్వలను గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించామన్నారు. సిబ్బంది నరేష్, రమేష్, క్రాంతి ఉన్నారు.
వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
03
Jul