అస్సాంలో కురుస్తోన్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. బ్రహ్మపుత్ర నది పొంగిపొర్లుతుండటంతో ప్రజలతో పాటు మూగజీవాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆ వరద నీటిలో ఓ పిల్ల ఏనుగు కొట్టుకొని పోతుండగా ఫారెస్ట్ గార్డులు రక్షించినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ప్రస్తుతం మానస్ నేషనల్ పార్క్ ఏనుగు పునరావాసం పొందుతున్నట్లు తెలియజేస్తూ దానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
భారీ వరదలు.. చిట్టి ఏనుగును కాపాడారు
03
Jul