ఒడిశాలోని గజపతి జిల్లాలో విషాదం జరిగింది. జగన్నాథ భజన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ బీరేంద్ర దాస్ స్టేజీపై పాట పాడుతూ కుప్పకూలిపోయారు. పాట పాడుతుండగా ఆయనకు గుండెపోటు రావడంతో ఉన్నట్టుండి కుప్పకూలినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయన్ను బెర్హంపూర్ MKCG ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.
స్టేజీపై పాట పాడుతూ కుప్పకూలిపోయాడు
12
Jul