AP: అల్లూరి జిల్లాలో విద్యుత్ పునరుద్ధరించేందుకు సిబ్బంది సాహసమే చేశారు. ఈదురుగాలులకు మారేడుమిల్లి మండలంలోని సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో నూరుపూడి గ్రామం వారం రోజులుగా అంధకారంలో ఉండిపోయింది. ఈ క్రమంలో జేఎల్ఎం రామయ్య, ఫ్రాంచైజీ వర్కర్ నీలన్న దొర సాహసోపేతంగా సన్నని తాడుపై వాగు దాటి వెళ్లి విద్యుత్‌ను పునరుద్ధరించారు. వారికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
సిబ్బంది సాహసం: తాడుపై వాగు దాటి విద్యుత్ పునరుద్ధరణ
26
Jul