దయ్యాలు ఉన్నాయంటూ దొంగ బాబా బెదిరింపులు.. చితకబాదిన స్థానికులు

TG: ‘మీ ఇంటికి నరదృష్టి ఉందంటూ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న దొంగ బాబాను చితకబాదిన ఘటన వికారాబాద్లో జరిగింది. ‘రూ.500-1,000 ఇస్తే తాయత్తు ఇస్తా. మీ ఇంట్లో దయ్యాన్ని మాయం చేస్తా. డబ్బు ఇవ్వకపోతే మీకు పాపం చుట్టుకుంటుంది’ అంటూ అతను మహిళలను బెదిరిస్తున్నాడు. దీంతో స్థానికులు అతడిని పట్టుకుని చితకబాదారు. దొంగ బాబాలను నమ్మి మోసపోవద్దని పలువురు హితవు పలుకుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *