TG: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ఉభయ రాష్ట్రాల్లో వర్షాలు ఆగాలని చిలుకూరు బాలాజీ భక్తులు శనివారం ప్రదక్షిణలు చేశారు. వరద సహాయానికి అన్ని విధాలుగా సహకరించిన ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. వరద సమయంలో సహాయక చర్యలకు రంగంలోకి దిగిన ఏపీ సీఎం చంద్రబాబును ఆలయ ప్రధాన పూజారి ప్రశంసించారు.
వర్షాలు ఆగిపోవాలని చిలుకూరులో ప్రదక్షిణలు
08
Sep