ఎన్నో ఆశలతో కువైట్కు వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి ఏజెంట్ చేతిలో మోసపోయాడు. ఎడారిలో తాను కష్టాలు పడుతున్నానని, కాపాడాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘ఎడారిలో మేకలు, గొర్రెలు, కుక్కలకు నేనొక్కడినే మేత వేస్తున్నా. నీళ్ల కోసం 2KM వెళ్లాల్సి వస్తోంది. ఈ ఎండలకు నా వల్ల కావట్లేదు. ఎవరైనా సాయం చేయండి. లేదంటే 2 రోజుల్లో చనిపోతాను’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అతనిది ఏ గ్రామమో వెల్లడించలేదు
కువైట్లో తెలుగోడి కష్టాలు.. కాపాడాలని వేడుకోలు
14
Jul