ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో కొట్టుకుపోతున్న ఓ భక్తుడిని జవాన్లు సాహసోపేతంగా రక్షించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. కంగ్రా ఘాట్ వద్ద పుణ్యస్నానం ఆచరించేందుకు గంగలోకి దిగిన శివభక్త్ అనే వ్యక్తి ప్రవాహానికి కొట్టుకుపోసాగాడు. ఇది గమనించిన డైవర్ సన్నీ సహా ఇద్దరు SDRF జవాన్లు శుభమ్, ఆసిఫ్ నదిలో ఎదురీది మరీ భక్తుడిని కాపాడారు. జవాన్ల సాహసంపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.
దేవుళ్లలా వచ్చి కాపాడారు!
24
Jul