AP: ఉద్యోగం కోసం ఒమన్ దేశానికి వెళ్లి ఇబ్బందిపడుతున్న మామిడి దుర్గ అనే మహిళకు మంత్రి లోకేశ్ భరోసానిచ్చారు. ఏజెంట్ల ద్వారా ఒమన్ దేశానికి వెళ్లి చిక్కుకుపోయానని ఆమె వీడియో షేర్ చేశారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి లేవలేని స్థితిలో ఉన్నానని, రక్షించాలంటూ ప్రాధేయపడ్డారు. లోకేశ్ స్పందిస్తూ ‘భయపడకు అమ్మా. TDP NRI విభాగం విదేశాంగ శాఖతో మాట్లాడి త్వరలోనే నిన్ను ఇండియాకు తీసుకొస్తాం’ అని ట్వీట్ చేశారు.
ఒమన్ చిక్కుకొని మహిళ ఆవేదన.. రంగంలోకి లోకేశ్
26
Jul