పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో చెప్పారు. సంబంధిత శాఖలతో చర్చించుకుని త్వరలో ఈ పథకంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేంద్రంతో కలిసి ఈ స్కీమ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. కాగా, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో NDA హామీ ఇచ్చింది.
త్వరలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై నిర్ణయం: నాదెండ్ల
26
Jul