రాష్ట్రంలోనే అత్యంత ఎత్తయిన జలపాతంగా పేరుపొందిన నెరడిగొండలోని కుంటాల జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సర్కార్ దృష్టిపెట్టింది. కుంటల జలపాతం వద్ద పర్యాటకులు సేద తీరేందుకు హరిత రిసార్ట్, కాటేజీలు, పార్క్, విశాలమైన రోడ్డు, కాంపౌండ్ వాల్, పార్కింగ్ స్థలం తదితర సదుపాయాల కోసం ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం రూ.3.81 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
కుంటాల పర్యాటకాభివృద్ధికి రూ.3.81 కోట్లు
01
Aug