అసెంబ్లీలోని తన ఆఫీసులో సీఎం రేవంత్ డప్పు కొట్టి దరువేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించి, రాష్ట్రంలో వెంటనే అమలు చేస్తామని ప్రకటించినందుకు ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు కాంగ్రెస్ నాయకులు డప్పు దరువులతో వచ్చి సీఎంకు ధన్యవాదాలు తెలపగా, వారితో కలిసి సీఎం కూడా దరువు వేశారు. అనంతరం సీఎం అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది.
డప్పు వాయించిన సీఎం రేవంత్
02
Aug