AP: కాకినాడ జిల్లా తునిలో గంజాయి మత్తులో ఓ యువకుడు నిన్న రాత్రి వీరంగం సృష్టించాడు. ఒంటిపై షర్టు లేకుండా నడిరోడ్డుపై నిలబడి రచ్చ చేశాడు. మరో ఇద్దరు యువకులు అతడిని నిలువరించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చంపేస్తానంటూ కేకలు వేస్తూ పరుగులు పెట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.
గంజాయి మత్తులో రోడ్డుపై యువకుడి రచ్చ
27
Aug