Ap అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పీఎస్ వద్ద TDP MLA జేసీ అస్మిత్ రెడ్డి నిరసనకు దిగారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను TDP శ్రేణులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై కేసు పెట్టాలని సీఐ లక్ష్మీకాంతరెడ్డికి ఎమ్మెల్యే అస్మిత్ ఫోన్ చేశారు. ‘నువ్వు చెబితే కేసు పెట్టాలా?’ అని సీఐ నిర్లక్ష్యంగా మాట్లాడారంటూ అందుకు నిరసనగా ఎమ్మెల్యే ఆందోళన చేపట్టారు.
తాడిపత్రిలో ఉద్రిక్తత.. నిరసనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే
28
Aug