AP: రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ కేసులు
పెరుగుతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. అల్లూరి జిల్లాలో మలేరియా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. విశాఖ, తిరుపతి, కర్నూలులో డెంగ్యూ కేసులు, ఏలూరు, తిరుపతి, చిత్తూరులో చికున్ గున్యా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 4,610 మలేరియా, 2,955 డెంగ్యూ, 99 గున్యా కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా మరిన్ని కేసులు ఉంటాయని అంచనా