TG: పాముతో చెలగాటం ఆడిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన మోచి శివరాజులు, తండ్రి గంగారాం పాములను పడుతూ జీవనం సాగిస్తారు. గంగారాం ఓ పామును పట్టి కుమారుడికి ఇచ్చాడు. నోట్లో పెట్టుకుని వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయమని చెప్పాడు. తండ్రి మాటతో శివరాజులు పామును నోట్లో పెట్టుకోగానే కాటేసింది. కాసేపటికే అతడు చనిపోయాడు
నోట్లో పాము పెట్టుకుని వీడియో.. మృతి
07
Sep