వైసీసీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు, చేప నూనె కలిపి అపవిత్రం చేసి.. హిందువుల మనోభావాలను దెబ్బతీయడాన్ని నిరసిస్తూ పవన్ కల్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతరా వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వమించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రథాలను తగులబెట్టారని, ఆలయాలను అపవిత్రం చేశారని ఆరోపించారు. ఏ మతమైనా సరే వారి మనోభావాలు దెబ్బకూడదని పవన్ కల్యాణ్ అన్నారు
వైసీసీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
24
Sep