J&K పుల్వామా ఉగ్రవాద దాడి కేసు నిందితుడు బిలాల్ అహ్మద్ కుచాయ్ గుండెపోటుతో మరణించాడు. జైల్లో గుండెపోటు రాగా జమ్మూలోని మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. 2019లో పుల్వామాలో CRPF సిబ్బందితో వెళ్తున్న బస్సుపై టెర్రరిస్టులు దాడి చేయడంతో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. సూసైడ్ బాంబర్కు బిలాల్ రవాణా సదుపాయంతో పాటు ఆశ్రయం కల్పించడంతో NIA అరెస్టు చేసింది.
గుండెపోటుతో పుల్వామా కేసు నిందితుడు మృతి
25
Sep