AP: ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసనకు దిగారు. ‘ధాలీ బచావో’ పేరిట నిర్వహించిన ఆందోళనలో ఆమె ప్లేటుపై గరిటెతో బాదుతూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు ‘సూపర్ సిక్స్.. కూటమి సర్కార్ అట్టర్ ప్లాప్’ అంటూ నినాదాలు చేశాయి.
ప్లేటుపై గరిటెతో కొడుతూ షర్మిల నిరసన
27
Sep