వసతి గృహ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. సిర్పూర్ (టి) గిరిజన ఆశ్రమ పాఠశాలను సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ఆయన సందర్శించి వసతి గృహ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే నిద్రించారు. విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆశ్రమ పాఠశాలలో పల్లె నిద్ర చేసిన ఆసిఫాబాద్ కలెక్టర్
02
Oct