ఆదివాసీ పోరాట యోధుడు అమరజీవి కుమురం భీం 84వ వర్థంతి వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్లో కుమురం భీం వర్థంతి కార్యక్రమాన్ని ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుమురం భీం విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో కుమురం భీం వర్ధంతి
27
Oct