AP: టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయ సంఘాలతో భేటీలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. టీచర్ల బదిలీలకు చట్టం రూపొందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం ట్రాన్స్ఫర్లు జరిగేలా చూడాలని భావిస్తోంది. విధివిధానాల ఖరారుపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరిగాక DECలో చట్టం అమల్లోకి తేవాలని చూస్తోంది. ఇటు మున్సిపల్ టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సైతం అంగీకారం తెలిపింది.
టీచర్ల బదిలీలకు చట్టం.. మున్సిపల్ టీచర్ల పదోన్నతులకు ఓకే!
27
Oct